హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా నెరవేర్చారు. 2018లో ఇచ్చిన 15 ముఖ్యమైన హామీల్లో 13 హామీలను నెరవేర్చి, మాటనిలుపుకొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి సిరిసిల్ల అభివృద్ధిపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఓ ఔత్సాహికుడు కేటీఆర్ ఇచ్చిన హామీలు ఎంతమేర నెరవేరాయని విశ్లేషించి, పోస్ట్ పెట్టగా భారీ స్పందన వస్తున్నది. సిరిసిల్ల మీద రామన్నకున్న ప్రేమకు ఇది నిదర్శనమని స్థానిక నెటిజన్లు కామెంట్లు చేశారు. ఆ రాముడిలెక్క ఈ తారకరాముడు మాటిస్తే తప్పడని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
2018లో కేటీఆర్ ఇచ్చిన హామీలు-అమలు
24