ధాన్యం కొనుగోలుపై వెంటనే సమీక్షించండి.. సీఎం రేవంత్‌కు కూనంనేని లేఖ
అధికారులతో సమీక్షించి ధాన్యం కొనుగోలులో వేగం పెరిగేలా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని సీపీఐఎల్పీ లీడర్ కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయనకు లేఖ రాశారు.
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : అధికారులతో సమీక్షించి ధాన్యం కొనుగోలులో వేగం పెరిగేలా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని సీపీఐఎల్పీ లీడర్ కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయనకు లేఖ రాశారు. మిల్లులకు వెళ్లిన లారీల్లోంచి ధాన్యం అన్లోడ్ చేయడం ఆలస్యమవుతుండటం కొనుగోలుకు ఆటంకంగా మారిందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో ధాన్యం లోడ్ చేసుకొనేందుకు లారీల యజమానులు భయపడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరతతో ధాన్యం సేకరణ పూర్తిగా మందగించిందని, రైతులు కాంటా కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. మక్కజొన్న కొనుగోలులో సంక్షోభాన్ని నివారించాలని కోరారు.
నాయీబ్రాహ్మణులపై కాంగ్రెస్ చిన్నచూపు
- భవిష్యత్తులో గుణపాఠం చెప్తాం
- రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ
హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ) : నాయీబ్రాహ్మణులపై కాంగ్రెస్ చిన్నచూపు చూస్తున్నదని, భవిష్యత్‌లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నామినేటెడ్ పదవుల్లో ఒక్క పదవినైనా నాయీబ్రాహ్మణులకు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా అవమానించిందని నిప్పులు చెరిగారు. నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పంద న లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, చైర్మన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ఆ నిధులు నేరుగా నాయీబ్రాహ్మణ కుటుంబాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ప్రకటనలో హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

