హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ, ఏపీ సర్కారుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ఒత్తిడి మేరకు ముంపుపై అధ్యయనానికి కాలపరిమితిని వి ధించింది. పోలవరం ముంపుతోపాటు ఇతర అనేక సాంకేతిక అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తో సంబంధిత రాష్ర్టాలన్నింటి మధ్య ఏకాభిప్రాయం సాధించాలని కోర్టు ఆదేశించింది. అందులో భాగంగా ఇప్పటికే రెండుసార్లు అన్ని రాష్ర్టాలతో సమావేశం నిర్వహించిన సీడబ్ల్యూసీ.. తాజాగా సోమవారం ఢిల్లీలో మూడో సమావేశాన్ని నిర్వహించింది. సీడబ్ల్యూసీ చైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ర్టాల అభిప్రాయాలు, అ భ్యంతరాలతోపాటు పోలవరం ముంపు సమస్యలు, సాంకేతిక అంశాలపై చర్చించారు.
ఫలించిన తెలంగాణ ఒత్తిడి
జాయింట్ సర్వే అంశంపై తెలంగాణ మరోసారి ప్రధానంగా పట్టుబట్టింది. పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్‌పై సంయుక్త సర్వే చేపట్టాలన్న డిమాండ్‌ను జనవరి 25న నిర్వహించిన రెండవ సాంకేతిక సమావేశంలోనే సీడబ్ల్యూసీ అంగీకరించింది. ఏపీని సమన్వయం చేసుకుంటూ సంయుక్త సర్వే చేపట్టాలని పీపీఏకు అప్పుడే ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రస్తుత సమావేశంలో తెలంగాణ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో వెంటనే స్పందించిన సీడబ్ల్యూసీ.. సంయుక్త సర్వే పూర్తిచేసేందుకు కాలపరిమితిని విధిస్తూ ప్రాజెక్టు అథారిటీకి అల్టిమేటం జారీ చేసింది. అందులో భాగంగా తొలుత ఏప్రిల్ 10లోగా తెలంగాణ, ఏపీతో సమావేశం నిర్వహించాలని పీపీఏను ఆదేశించింది. ముంపుపై ఇరు రాష్ర్టాలు గతంలో చేసిన అధ్యయనాలు, రూ పొందించిన మ్యాపులపై చర్చించాలని దిశానిర్దేశం చేసింది. ఆ తర్వాత సత్వరమే సంయుక్త సర్వే చేపట్టాలని నొక్కిచెప్పింది. ఈ సమావేశంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు సైతం పలు డిమాండ్లను సీడబ్ల్యూసీకి నివేదించాయి. ముంపునకు సంబంధించి గోపాలకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను ఎట్టిపరిస్థితులోనూ అంగీకరించేది లేదని, కొత్తగా అధ్యయనం చేసి, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. సమావేశంలో తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేంద్రరావు, చీఫ్ ఇంజినీర్ కొత్తగూడెం శ్రీనివాస్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, తెలంగాణ ఇంటర్ స్టేట్ బోర్డు గోదావరి డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్, ఒడిశా ఈఎన్సీ అశుతోష్‌దాస్, సీడబ్ల్యూసీ, పీపీఏ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ వాదనలు