TS Weather Update | హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో మరికొన్ని గంటల్లో అల్పపీడనం ఏ ర్పడి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వా తావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ సీజన్లో జూలై చివర్లో కుండపోత వర్షాలతో వరదలు ముంచెత్తాయి. ఈ నెలలో ఇప్పటివరకు చినుకు జాడ లేదు.