SPDCL | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఆరోపణలున్నా.. డోంట్‌కేర్. ఏసీబీ కేసులున్నా పట్టింపేలేదు. ఆంధ్రా నేపథ్యమున్న అధికారులు ఎవరైనా ఫర్వాలేదు. పైసలిచ్చుకో.. పోస్టింగ్ పుచ్చుకో అన్నట్టుగా విద్యుత్తు సంస్థ ల్లో దందా నడుస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దల అండదండలతో ఆంధ్రా అధికారులకు కీలక స్థానాలు లభిస్తున్నాయని, తెలంగాణ అధికారులకు అన్యాయం జరుగుతున్నదని తెలుస్తున్నది. ఏసీబీ కేసులున్న వారికి కూడా ఫోకల్ పోస్టులు కట్టబెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా దక్షిణ డిస్కం పరిధిలోడివిజినల్ ఇంజినీర్ (డీఈ) పోస్ట్‌కు చాలా గిరాకీ ఉందని, అధికారులు ఎంత లంచమిచ్చి అయినా ఆ పోస్టులో కూర్చుకునేందుకు తహతహలాడుతున్నారని తెలుస్తున్నది. ఇటీవలే ఓ డీఈ పోస్ట్ రూ.40 లక్షలు పలికిందని విద్యుత్తుశాఖలో ప్రచారం జరుగుతున్నది. ఏబీసీ కేసు పెండింగ్‌లో ఉన్న ఓ ఇంజినీర్ అధికారి రూ.25 లక్షలు పెట్టి పోస్టింగ్ తీసుకున్నట్టు సమాచారం.
ఖాళీ కాకముందే కర్చీఫ్
డిస్కంలలో డీఈ-ఆపరేషన్స్, డీఈ-టెక్నికల్ పోస్టులకు మంచి డిమాండ్ ఉన్నది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో పరిధిలో పోస్టింగ్ అంటే అత్యంత ఖరీదుతో కూడుకున్నదని విద్యుత్తుశాఖ అధికారులే చెప్తున్నారు. ఇవన్నీ ఫోకల్ పోస్టులే. ఆయా స్థానాల్లో తిష్టవేస్తే భారీగా లంచాలు తీసుకోవచ్చని, అందుకే ఆయా పోస్టుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని వినికిడి. అంతేకాకుండా ఇటీవలీ కాలంలో డివిజినల్ ఇంజినీర్ల రిటైర్మెంట్స్ పెరిగాయి. దీంతో సదరు అధికారి రిటైర్ కాకముందే.. ఆ పోస్ట్ కోసం కొందరు అధికారులు పైరవీలు మొదలుపెడుతున్నారు. తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు.
ఫలానా డీఈ పోస్ట్ త్వరలోనే ఖాళీ అవుతుందనీ, ఆ తర్వాత అక్కడ చేరబోయేది తానేనని, ఇందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని కొందరు అధికారులు చెప్పుకుంటున్నారు. ఫలానా పోస్ట్ సేల్ అయిపోయిందని, ఫలానా అధికారి కర్చీఫ్ వేసుకున్నారని కూడా కొందరు చర్చించుకుంటున్నారు. విద్యుత్తు సంస్థల్లో చాలామంది అధికారులు అడ్డగోలుగా లంచాలు తీసుకుంటున్నారు. ఇటీవలీ కాలంలో రోజుకొకరు చొప్పున ఏసీబీకి చిక్కుతున్నారు. విద్యుత్తుశాఖలో ఇదంతా కామనేలే అన్నట్టుగా నడిచిపోతున్నది. ఏబీసీ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ కీలక పోస్టులు కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
విత్యుత్తుశాఖ పోస్టింగ్స్‌లో వింతలు