శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన విదేశీ బంగారం..
Shamshabad airport | శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అధికారులు 827 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అధికారులు 827 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ అనే వ్యక్తివద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారం పేస్ట్ లభించింది. దీంతో దానిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 46.51 లక్షల ఉంటుందని చెప్పారు.
బంగారాన్ని కరిగించి పేస్ట్‌గా మార్చి టీ షర్ట్ వెనుక భాగానికి పూసుకుని తరలించడానికి ప్రయత్నించాడని అధికారులు తెలిపారు. విచారణ నిమిత్తం అతడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బంగారాన్ని ఎక్కడి తీసుకెళ్తున్నాడనే విషయంపై ఆరాతీస్తున్నారు. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

