పెద్దపల్లి, జూన్ 2 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలోని చెరువులను మట్టి మాఫి యా చెరబట్టింది. నల్ల ఒండ్రుమట్టిని పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. ఒక్క ఇటుక బట్టీ పేరిట అనుమతి తీసుకొని, పదుల సంఖ్యలో బట్టీలకు తరలించుకుపోతున్నారు. అధికారులకు చిక్కకుండా మట్టిని ఒక చోట లోడింగ్ చేసి, కొలతలకు చిక్కకుండా చదును చేసి కుప్పలను నేలకు సమానంగా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
జిల్లాలో 180 వరకు ఇటుక బట్టీలు
జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, కమాన్‌పూర్, రామగిరి, ధర్మారం, మంథని మండలాల్లో 180కి పైగా ఇటుక బట్టీలు ఉన్నాయి. హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తదితర నగరాలకు ఇక్కడి నుంచే ఇ టుకలు సరఫరా అవుతాయి. వీటి తయారీకి చెరువు ఒండ్రు మట్టితోపాటు ఫ్లైయాష్ వాడుతారు. పదేండ్లుగా అన్ని చెరువుల్లో నీళ్లు ఉండ గా, ఈ సారి వేసవిలోనే నీళ్లు లేక అనేక చెరు వులు ఎండిపోయాయి. దీంతో ప్రైవేటు, ఇటు క బట్టీల వ్యాపారులు స్థానిక నాయకులను, అధికారులను మచ్చిక చేసుకొని మట్టిని బట్టీలకు తరలిస్తున్నారు. తకువ మొత్తంలో సీనరేజ్ సొమ్ము చెల్లించి పెద్దమొత్తంలో మట్టిని తరలిస్తున్నారు.
మట్టి క్వారీలు సీజ్
కమాన్‌పూర్ మండలం జూలపల్లి పెద్దచెరువులోని మట్టిని తరలించేందుకు గౌరెడ్డిపేటకు చెందిన ఇటుక బట్టి యజమాని మొదట 4 వేల క్యూబిక్ మీటర్లకు, ఆ తర్వాత 2 వేల క్యూబిక్ మీటర్లకు రూ.3.84 లక్షల సీనరేజీ సొమ్ము చెల్లించారు. కానీ, ఈ చెరువు నుంచి 12 వేల నుంచి 15 వేల క్యూబిక్ మీటర్ల మట్టి ని తరలించాడనే ఆరోపణలున్నాయి. సుల్తానాబాద్ మండలం మియాపూర్‌కు చెందిన వ్యక్తి రామగుండం మండలం అల్లూరు చెరు వు నుంచి 2 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించుకునేందుకు రూ.1,28,000 సీనరేజ్ సొమ్ము చెల్లించాడు. కానీ, 8 వేల నుంచి 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించాడు. దీంతో అధికారులు ఆ క్వారీని సీజ్ చేశారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని మల్లికార్జున బ్రిక్స్ కంపెనీ అల్లూరు చెరువులో 2 వేల మెట్రిక్ టన్నుల మట్టికి అనుమతి తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలించడంతో తహసీల్దార్ కుమారస్వామి అల్లూరు చెరువును పరిశీలించారు. భారీ యంత్రాలు, టిప్పర్లు ఉండటంతో వాటిని సీజ్ చేసి, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మంథని మండలం బిట్టుపల్లి చెరువులో మట్టి తవ్వకా లపై ఫిర్యాదులు రావడంతో పనులు నిలిపివేశారు. గుంజపడుగుకు చెందిన అక్షయ్ బ్రిక్స్, మరో 7 సంస్థలు బిట్టుపల్లి పెద్ద చెరువు నుంచి ఇటుక బట్టీల కోసం 80 వేల మెట్రిక్ టన్నుల మట్టి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 10 వేల మెట్రిక్ టన్నుల మట్టికి సీనరేజ్ చెల్లించి, ఎకువ లోతు మట్టి తవ్వడంతో ఇరిగేషన్ అధికారులు ఈ నెల 26 నుంచి 31 వరకు ఇచ్చిన తాతాలిక అనుమతులు రద్దు చేశారు.
ముర్మూరులో మట్టితీత
అంతర్గాం మండలం ముర్మూరు చెరువు లోని మట్టిని టిప్పర్ల ద్వారా మరో చోట డంప్ చేస్తున్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన ఎస్హెచ్ఆర్ బ్రిక్స్‌కు చెందిన ఏ శ్రీనివాస్ 3000 మెట్రిక్ టన్నులకు గత నెల 22 నుంచి ఈ నెల 5 వరకు మట్టితీతకు అనుమతి ఇచ్చారు. 25వ తేదీ వరకే 3 వేల మెట్రిక్ టన్నులు తవ్వినట్టు గుర్తించి మట్టితీతను నిలిపివేయాలని ఇరిగేషన్ డీఈ ఆదేశించారు. ఏఎస్ఆర్ బ్రిక్స్‌కు సైతం 14,500 మెట్రిక్ టన్ను ల మట్టి తరలించేందుకు రూ.5.30 లక్షల వరకు చెల్లించి అనుమతి తీసుకున్నారు. ఎలా ంటి రక్షణ చర్యలూ చేపట్టకుండా పగలూ రాత్రి మట్టి తవ్వకాలను చేపడుతూ సమీపంలోనే డంప్ చేస్తున్నారు.
అనుమతులు లేకుండానే మట్టితీత
పెద్దపల్లి మండలం రాఘవాపూర్, రంగాపూర్, గౌరెడ్డిపేట, భోజన్నపేట, తుర్కల మద్దికుంటతోపాటు జిల్లాలోని మంథని, కమాన్‌పూర్, ముత్తారం, ధర్మారం, శ్రీరాంపూర్, సు ల్తానాబాద్, ఎలిగేడు మండలాల్లో అనుమతు లు లేకుండానే మట్టి తవ్వకాలు చేపడుతు న్నారు. వీటిపై అధికారులు స్పందిస్తున్నా.. ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నారు.
50 వాహనాల వరకూ సీజ్
మట్టిని తరలిస్తున్న దాదాపుగా 50 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. పెద్దపల్లి, కమాన్‌పూర్, రామగిరి, మంథని మండలాల్లో వాహనాలను సీజ్ చేసి వాటిని పోలీసు స్టేషన్లకు తరలించారు. సీజ్ చేసిన వాహనాలను వదిలి పెట్టాలని అధికారులపై ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తున్నది.
నల్లగొండ జిల్లాలో ఆగని మట్టిదందా
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల రిజర్వాయర్‌లోనూ నెల రోజులుగా ఒండ్రుమట్టి దందా కొనసాగుతున్నది. ఇటుక బట్టీల వ్యాపారి ఇరిగేషన్‌శాఖకు నామమాత్రం గా రూ.4.15 లక్షలు సీవరేజీగా చెల్లించి, అనుమతికి మూడింతలు అదనంగా బం కమట్టిని తరలించాడు. నిబంధనలకు విరుద్ధంగా చెరువు కట్టవరకు పదిఫీట్ల లోతు వరకు 10-15 రోజులు తవ్వి తీసుకెళ్లాడు. ఇదే అదనుగా మరి కొందరు ఇటుక బట్టీల వ్యాపారులు అనుమతులు లేకుండా ఎమ్మెల్యే భరోసాతో అక్రమంగా ఆదివారం వరకు కూడా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.