Sam Curran | ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు ఇసాబెల్లెను మనువాడనున్నాడు. ఈ మేరకు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల సామ్ కర్రన్‌ను రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌కు బదిలీ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో కొత్త ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగనున్నాడు. సామ్ కర్రాన్ కాబోయే భార్య ఇసాబెల్లె సైమండ్స్ విల్మాట్ లండన్క్ చెందిన యువతి.
ఇసాబెల్లె తొలిసారిగా 2019 ఐపీఎల్ సమయంలో భారత్‌ను సందర్శించింది. ఆ సమయంలో స్టార్ ఆల్ రౌండర్ పంజాబ్ కింగ్స్‌లో ఉన్నాడు. ఇద్దరూ చాలాసార్లు చెట్టాపట్టాలేసుకొని కనిపించారు. గతంలో శ్రీలంకలో సర్ఫింగ్ చేస్తూ, సఫారీని ఆస్వాదిస్తూ కనిపించారు. ఇసాబెల్లె ఇన్స్టాగ్రామ్ బయో ప్రకారం.. ఆమెకు ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. ఆమె ఫ్రొఫెషనల్ థియేటర్ ఆర్టిస్ట్. సామ్ కర్రన్ నిశ్చితార్థం ఇసాబెల్లెతో గత గురువారం జరిగింది. అయితే, శనివారం సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేస్తూ విషయాన్ని ప్రకటించాడు. కర్రాన్ ఇంగ్లండ్ తరఫున 24 టెస్టులు ఆడి.. 815 పరుగులు చేసి.. 45 వికెట్లు పడగొట్టాడు. ఇక 38 వన్డేలు ఆడి.. 637 పరుగులు చేసి 35 వికెట్లు తీశాడు. 64 T20టీల్లో 450 పరుగులు చేసి 57 వికెట్లు కూల్చాడు.