తిప్పర్తి, నవంబర్ 22: కన్న కొడుకులు తనను పట్టించుకోకపోవడంతో కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని ఓ తండ్రి రద్దు చేశాడు. నల్లగొండ జిల్లా రాజుపేటకి చెందిన లోకాని కొండయ్య ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 1.17 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి సేల్ డీడ్ చేశాడు. ఇప్పుడు వారు తనను పట్టించుకోకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.
కలెక్టర్ రంగంలోకి దిగి, కొండయ్య కుమారుల పేరు మీద ఉన్న సేల్ డీడ్‌ను రద్దు చేశారు. తిరిగి కొండయ్య పేరు మీదికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కలెక్టర్‌కు కొండయ్య కృతజ్ఞతలు తెలిపాడు.