Ram Pothineni | ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రీ-రిలీజ్ సందడి వైజాగ్‌లో జోష్‌గా జరిగింది. మహేష్ బాబు.పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్అం డ్ఎ మోషనల్ ఎంటర్టైనర్లో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. నవంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమాకి ప్రమోషన్స్ వేగం పెంచిన మేకర్స్, వైజాగ్‌లో మెగా మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో రామ్ లైవ్ స్టేజ్‌పై ఇచ్చిన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అభిమానులను ఆకట్టుకుంది. సినిమాలోని పాట పాడి తెగ సందడి చేశాడు.
ఇక రామ్ మాట్లాడుతూ.. నా కెరీర్లో ఎంతో గర్వపడే సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. నేను చేసిన మిగతా సినిమాలన్నీ ఒక ఫ్రేమ్‌లో ఉంటే, డైరెక్టర్ మహేష్ ఈ సినిమాను చాలా పెద్ద స్కేల్లో ప్లాన్ చేశారు. ఆ ఫ్రేమ్ నా గుండెల్లో అలాగే ఉంటుంది” అన్నారు.ప్రొడ్యూసర్లు రవి, నవీన్ నుంచి డిఓపిలు జార్జ్, సిద్ధార్థ నూని వరకు అందరూ అద్భుతంగా పనిచేశారని రామ్ ప్రశంసించారు. తెలుగు సినిమాకి కొత్త సౌండ్ తీసుకురావాలని రెండేళ్లుగా వెతికాను. చివరకు వివేక్–మెర్విన్ దొరికారు. మాస్, ఎంట్రీ, ఫన్, మెలోడీ అన్నీ మిక్స్ అయిన కంప్లీట్ ఆల్బమ్ ఇచ్చారు. వీళ్లిద్దరూ ఇండస్ట్రీలో ఇంకా ఎన్నో ఏళ్లుపాటు పెద్ద స్థాయికి వెళ్తారు” అని అన్నారు.
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి మాట్లాడుతూ.. మొదట ఆమెపై కాస్త డౌట్ పడినా, ఆమె పర్ఫార్మెన్స్ వీడియో చూసిన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది. గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్ కూడా చేసే హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత వచ్చింది. మా సినిమా సీన్స్ చూసినప్పుడు నేను, మహేష్ బ్లాంక్ అయిపోయాం. భాగ్యశ్రీ అవార్డుకి అర్హురాలు కాదు… ఆ అవార్డే భాగ్యశ్రీకి అర్హురాలు అని పొగడ్తలతో ముంచెత్తారు. ఉపేంద్ర గురించి మాట్లాడుతూ.. 25 ఏళ్ల క్రితం చనిపోవాలని అనుకున్న వ్యక్తి, ఉపేంద్ర గారి సినిమా చూసి తన జీవితం మార్చుకున్నాడు. అంతటి పవర్ ఆయన సినిమాలకు ఉంది. ఆయనతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను అని తెలిపారు. ఎన్నోసార్లు పడిన… కింద ఉన్నా… అన్నీ చూస్తున్నా. నా పర్పస్ మీరే. ప్యాషన్, పర్పస్ ఉంటే మళ్లీ పైకి రావడానికి ఎవ్వరూ ఆపలేరు. సమయం వస్తే వడ్డీతో పాటు లాగేద్దాం! ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 27న రిలీజ్ అవుతోంది. అందరం థియేటర్లలో కలుద్దాం” అన్నారు.