18 నుంచి వీవోఏల నిరవధిక సమ్మె
రాష్ట్రంలోని ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీవోఏ) తమ సమస్యల పరిషారం కోసం మరోసారి పోరాట బాట పట్టారు. ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు వీవోఏల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది.
- రాష్ట్రంలో సమ్మెబాట పట్టనున్న18 వేల ఐకేపీ వీవోఏలు
- సెర్ప్ సీఈవో దివ్యకు నోటీసు అందజేసిన రాష్ట్ర జేఏసీ
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీవోఏ) తమ సమస్యల పరిషారం కోసం మరోసారి పోరాట బాట పట్టారు. ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు వీవోఏల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. సోమవారం గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సీఈవో దివ్యాదేవరాజన్‌కు సమ్మె నోటీసును అందజేశారు. సోమవారం నిర్వహించిన తమ రాష్ట్ర కమిటీ సమావేశంలో వీవోఏల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సభ్యులు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిషరించకపోవడంతో, శాంతియుత పద్ధతిలో విధులను బహిషరించి నిరవధిక సమ్మె చేయాలని జేఏసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
వీవోఏల సమస్యల పరిషారానికై జేఏసీ ప్రధానంగా ఆరు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టింది. ‘వీవోఏల కనీస వేతనాన్ని రూ.20 వేలకు పెంచాలి. వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలి. అర్హులైన వీవోఏలకు సీసీలుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. వీవోఏలకు రూ.10 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. విధి నిర్వహణ కోసం ట్యాబ్‌ల సౌకర్యం కల్పించాలి. వయోపరిమితికి సంబంధించిన జీవో నంబర్ 58ని సవరించాలి’ అని కోరింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిషరించాలని, లేనిపక్షంలో మే 18 నుంచి సమ్మె తప్పదని వారు హెచ్చరించారు. రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు నాగుల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కేతావత్ శరత్‌కుమార్, వరింగ్ ప్రెసిడెంట్ ఇర్ప పవన్, కోశాధికారి గజెల్లి భీమేశ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

