హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్)ల్లో ప్రవేశాలకు ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఐఏటీ)ను జూన్ 9న నిర్వహించనున్నారు.
సోమవారం నుంచి మే 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మేనెల16, 17 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం ఉన్నది.