హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మల్టీ జోన్-1 పరిధిలోని 49 మంది ఇన్స్పెక్టర్లను బదిలీలు చేస్తూ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో వెయిటింగ్లో ఉన్న పలువురికి కొత్తగా పోస్టింగులిచ్చారు.
వరంగల్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్వినయ్కుమార్ను పాల్వంచకు, పాల్వంచలోని నాగరాజును ఐజీ కార్యాలయానికి, వరంగల్ కమిషనరేట్ నుంచి రమేశ్‌ను కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్గా, కొత్తగూడెం టూ టౌన్లో ఉన్న రాజును మహబూబాద్ జిల్లా మరిపెడకు, మరిపెడలో ఉన్న సాగర్‌ను ఐజీ కార్యాలయానికి, మహబూబాబాద్ డీసీఆర్బీలో ఉన్న ఫణిందర్‌ను గూడూరుకు, గూడూరులోని షేక్ యాసిన్‌ను ఐజీ కార్యాలయానికి, ట్రాన్స్ఫర్ చేశారు.