Chandrababu | పూర్వాశ్రమంలో అతని వృత్తి ఏంటన్నది మనకు అనవసరం. సున్నాలేశాడో, వేయించాడో, రియల్ ఎస్టేటో, కబ్జాలో, సెటిల్మెంట్లో… ఏదైనా కావచ్చు. ఇప్పుడది అప్రస్తుతం. రేవంత్ రెడ్డి బాగా చదువుకోలేదు. అర్థవంతమైన ఒక పూర్తి వాక్యం మాట్లాడలేడు. నోరు తెరిస్తే అసభ్య పదజాలం. సీఎం స్థానానికి అయినా గౌరవం ఇవ్వలేని అజ్ఞాని.
కట్ చేస్తే ….
తెలంగాణలో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలో నోట్ల కట్టలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి జైలుకెళ్లాడు రేవంత్ రెడ్డి. ఆ డబ్బు ఎలా వచ్చింది? ఎవరిది?
ఒకప్పుడు సోనియా గాంధీని ‘బలి దేవత’, రాహుల్ గాంధీని ‘పప్పు‘ అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఇప్పుడు సొంత పార్టీ వాళ్లే బాహాటంగా చెబుతున్న మాటల ప్రకారం, రూ. 50 కోట్లు ఢిల్లీలో చెల్లించి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పీఠం ఎక్కాడు. అంత డబ్బు అతనికెక్కడిది?
అంతకు ముందున్న టీడీపీలో వలస పాలకుల అడుగులకు మడుగులొత్తడం తప్ప.. రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారైనా మంత్రిగా చెయ్యలేదు. అంత పరపతీ లేదు. అంబానీ, అదానీ లెవెల్లో వ్యాపారవేత్త కూడా కాదు. ఎలక్షన్స్ కోసం ఇన్ని భారీ సభలను పెట్టేంత డబ్బు అతనికి ఎవరిస్తున్నారు?
సింపుల్ ఆన్సర్…
తెలంగాణలో మేం పోటీ చెయ్యం అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలని బాబు అన్నారు. రేవంత్‌కు ఇంత డబ్బు ఎక్కడిదో ఇప్పుడు ఆలోచించండి. సో… రేవంత్ రెడ్డి అంటే బయటికి పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు. లోపల మాత్రం చంద్రబాబు పెంపుడు కొడుకే. మీరు బై మిస్టేక్ కాంగ్రెస్‌కో, రేవంత్ రెడ్డికో ఓటేస్తున్నారంటే అది వారికి వేస్తున్న ఓటు కాదు..డైరెక్ట్‌గా చంద్రబాబుకు వేస్తున్న ఓటు!
కాంగ్రెస్‌కు ఓటేసి మళ్లీ తెలంగాణలోకి వలస పాలకులను తెచ్చుకుందామా? బీఆర్ఎస్కు ఓటేసి, దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న మన కేసీఆర్‌ను కాపాడుకుందామా? నిర్ణయం మీదే…
…?మనోహర్ చిమ్మని