హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగా ణ): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటి వద్దకే బస్సు పంపే ఏర్పా టు చేసింది. శైవక్షేత్రాలు, పుణ్యతీర్థాలకు వెళ్లాలనుకొనే భక్తులు 30 మంది బృందంగా ఏర్పడిన వారికైనా లేదా ఒక కాలనీలో ఉండేవారు కలిసి వెళ్లాలనుకొన్నా ఆర్టీసీకి ఫోన్‌చేస్తే ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేవలు అవసరమైన భక్తులు సమీపంలోని ఆర్టీసీ డిపో మేనేజర్‌ను లేదా 040-30102 829, 040-68153333 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.