బీసీలను చీల్చడానికి రేవంత్ కుట్రలు
రాష్ట్ర బంద్‌తో బెంబేలెత్తిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీ ఉద్యమాన్ని చీల్చడానికి భారీ కుట్రలు చేస్తున్నారని బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్యఆరోపించారు ఖబడ్దార్.. బీసీ నేతలను డబ్బు సంచులతో కొనాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు.
- ఖబడ్ద్దార్.. డబ్బుతో కొనాలని చూస్తే సహించం
- 42% రిజర్వేషన్ల కోసం భారీ ఉద్యమం చేస్తాం
- అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ర్యాలీలు, దీక్షలు
- అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకపోతే కాంగ్రెస్‌ను బీసీ ద్రోహుల పార్టీగా ప్రకటిస్తాం: ఆర్ కృష్ణయ్య
రవీంద్రభారతి, నవంబర్ 3: రాష్ట్ర బంద్‌తో బెంబేలెత్తిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీ ఉద్యమాన్ని చీల్చడానికి భారీ కుట్రలు చేస్తున్నారని బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు ఖబడ్దార్.. బీసీ నేతలను డబ్బు సంచులతో కొనాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. సోమవారం బషీర్‌బాగ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎత్తరి భీమ్రాజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం భారీ ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మంగళవారం నుం చి ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ రిజర్వేషన్ల సాధన నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు తెలిపారు. నేపాల్, తెలంగాణ ఉద్యమ తరహాలో ఓయూ విద్యార్థులు ఉద్యమించి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వకుండా తరమికొట్టాలని పిలుపునిచ్చారు. 42% రిజర్వేషన్లు పార్టీపరం గా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు.
రాహుల్ ఎందుకు మాట్లాడరు?
పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బీసీ రిజర్వేషన్లపై ఒక్కసారి కూడా ఎందుకు చర్చకు తీసుకొని రాలేదని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలనుకుంటే తక్షణమే ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో కొట్లాడి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్పించాలని, లేకుంటే సీఎం రేవంత్‌రెడ్డి బీసీల ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. 18న జరిగిన బంద్‌లో పాల్గొన్న బీసీ నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

