హైదరాబాద్ : ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కేంద్రంలోని ప్రభుత్వాన్ని నిలదీయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Thalasani) డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లి లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
బీజేపీ నాయకులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులతో మిలీనియం మార్చ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలో మిలీనియం మార్చ్ చేయాలని సవాలు విసిరారు. ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ( BJP )ప్రభుత్వం 9 సంవత్సరాలలో ఎన్ని భర్తీ చేసిందని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్(KCR) ప్రభుత్వం 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని,90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.
గత ప్రభుత్వాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్(BR Ambedkar) పేరును ఉపయోగించుకొన్నాయే తప్ప సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) మాత్రమే దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి నిజమైన గౌరవం కల్పించారని వెల్లడించారు.కేంద్రం నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేయడం చేతకాని బీజేపీ నేతలు ప్రభుత్వం పై విమర్శలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.కేంద్రమంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి నాలుగు సంవ త్సరాలలో ఎన్ని నిధులు తెచ్చారని, ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.