రాజ్భవన్లను ఇక కర్తవ్య భవన్ అనాలా?
దేశరాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెణుకులు విసిరారు. ‘రాజ్ స్థానంలో కర్తవ్య పెట్టాలంటే రాజ్భవన్లు అన్నింటిని కర్తవ్య భవన్లు అని పిలవాలేమో
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశరాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెణుకులు విసిరారు. ‘రాజ్ స్థానంలో కర్తవ్య పెట్టాలంటే రాజ్భవన్లు అన్నింటిని కర్తవ్య భవన్లు అని పిలవాలేమో.. పనిలోపనిగా రాజస్థాన్‌ను కర్తవ్యస్థాన్ అని మారిస్తే సరిపోతుంది’ అని ఎద్దేవా చేశారు.
రాజ్‌పథ్ అనేది బానిస స్థితిని సూచిస్తున్నదని, అందుకే ఆ పేరును చరిత్రలో కలిపేశామని ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై థరూర్ పైవిధంగా స్పందించారు. తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కూడా రాజ్‌భవన్‌లపై థరూర్ వేసిన జోక్‌నే తన ట్విట్టర్లో పెట్టారు. పస్చిమబెంగాల్ బీజేపీ కొత్త ఇంచార్జిగా నియమితుడైన మంగళ్‌పాండే కర్తవ్యధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కి, కర్తవ్య కచోరీ తిని, కర్తవ్యభోగ్ ఎంజాయ్ చేస్తారా అని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

