వేములవాడ, ఆగస్టు 13: “ బీఆర్ఎస్ హయాంలో వేములవాడ ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు ఎంతో బాగుండే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఎందుకింత అలసత్వం.. జ్వరం వచ్చిందని పోతే రోగ నిర్ధారణ చేసే యంత్రాలు పనిచేస్తలేవు. టెస్టులు ఈ రోజు ఇస్తే రిపోర్టులు రేపొస్తయట..? ఇదేం పద్ధతి. లోపాలను సరి చేసి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి” అని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఓ గ్రామాని కి చెందిన ఓ పేషెంట్ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. బాధితుడు వీడియోలో పేర్కొన్న వి వరాల ప్రకారం.. ‘నేను వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న. గురువారం వే ములవాడ ప్రభుత్వ దవాఖానకు వచ్చిన. ఓపీలో పేరు నమోదు చేసుకునే సిబ్బంది రాలేదు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని వైద్యులకు చెప్పడంతో సీబీపీతోపాటు ఆర్బీఎస్, వైర ల్, డెంగ్యూ తదితర రక్త పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ చెప్పారు.
వెంటనే పరీక్షల కోసం ల్యా బ్ వద్దకు వెళ్లా. అక్కడ సీబీపీ యంత్రం పనిచేయడం లేద ని, ఈ టెస్టు ఇప్పుడు ఇకడ చేయ డం సాధ్యం కాద ని సిబ్బంది చెప్పారు. మిగ తా పరీక్షల రిపోర్టు కూడా ఈరోజు రాత్రికి మీ ఫోన్కు వస్తుందని, మరుసటి రోజు మీ సేవలో రిపోర్టులు ప్రింట్ తీసుకొని వచ్చి వైద్యుడికి చూపెట్టుకోవాలని సలహా ఇచ్చారు. తీవ్ర జ్వరమని దవాఖానకు వస్తే వెంటనే పరీక్షలు చేసి మందులు ఇవ్వాల్సింది పోయి ‘రిపోర్టులు ఈరోజు కాదు రేపు వస్తాయంటే ఎలా.? మరోసారి ప్రయాణ ఖర్చులు భరించి దవాఖానకు ఎలా వస్తారు.?’
అని సదరు వ్యక్తి వీడియోలో ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో ఇదే ఏరియా దవాఖానలో చాలా మంచి సేవలు అందాయని, ఇకడే తన భార్యకు కాన్పు కూడా చేయించానని గుర్తుచేశాడు. ప్రస్తుతం సేవలు అధ్వానంగా ఉండటంతో పాటు సిబ్బంది నుంచి సమాధానం నిర్లక్ష్యంగా ఉందన్నాడు. వ్యవస్థలోని లోపాలు సరిచేసి వేములవాడ దవాఖానకు వచ్చే పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వీడియోలో ఎమ్మెల్యేతోపాటు అధికారులను కోరుతూ, ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.