KTR : రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్రెడ్డి (Revanth Reddy) పై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working president) కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. సీఎంకు ఏ పని ఎలా చేయాలో తెలియక ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల నాటి ప్రాజెక్టు పనులను నిపుణులను సంప్రదించకుండానే ప్రారంభించారని, 8 మంది కార్మికులు టన్నెల్ చిక్కుకోవడానికి అదే కారణమైందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇతరులను నిందించడం మానుకుని పనిపైన దృష్టిపెట్టాలని సూచించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 కార్మికులు చిక్కుకున్న ఘటనకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను నిందించడంపై కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డికి పని చేతగాదని మండిపడ్డారు. ‘ఆయనకు ఎలా పని చేయాలో తెలియకపోతే ఇతరులపై ఆరోపణలు చేయడం సులభంగా ఉంటుంది. పదేళ్ల కిందటి ప్రాజెక్టు పనులను నిపుణులను, ఇంజినీర్లను సంప్రదించకుండానే మొదలుపెట్టారు. అదే ఇప్పుడు 8 మంది కార్మికులు టన్నెల్లోపల చిక్కుకోవడానికి కారణమైంది’ అని కేటీఆర్ ఆరోపించారు.
కార్మికులు టన్నెల్ చిక్కుకుని ఇన్నిరోజలవుతున్నా ఇప్పటిదాకా వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారని, వారి బతికున్నారో మరణించారో కూడా ఎవరికీ తెలియదని అన్నారు. రేవంత్ రెడ్డి ఇతరులపై నిందలు వేయడం మానుకుని పనిపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రవర్తన, మాటతీరు ముఖ్యమంత్రి (Chief Minister) లాగే ఉండాలని, చవకబారు మంత్రి (Cheap Minister) లా ఉండకూడదని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC tunnel) కూలిపోవడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆ ఆరోపణలను తిప్పికొట్టారు.