యాదగిరిగుట్ట. యాదాద్రి, భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి (Mla Shekar Reddy ) ఆరోపించారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను బట్టి రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే రైతుల గోసలు పునరావృతమవుతాయని అన్నారు.
టీ పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఆర్ (BRS) ఆధ్వర్యాన భువనగిరి జిల్లాకేంద్రంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చే 24 గంటల ఉచిత విద్యుత్ రద్దు చేసి మూడు గంటల విద్యుత్ మాత్రమే ఇవ్వాలని అనడం కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ లో 24 గంటల ఉచిత విద్యుత్ వల్లనే రైతులు పంటలు పుష్కలంగా పండించుకుంటున్నారని వెల్లడించారు.
ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ (Free Power ), రైతు బంధుతో రైతులు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందన్న భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులుమతి భ్రమించి రైతు వ్యతిరేక విధానాలపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ రైతే రాజు అనే నినాదం తో రైతాంగ విధానాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మరోమారు అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులను రోడ్లపై కూడా తిరగనివ్వరని అన్నారు.