హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాతి చిత్రాలను గుర్తించింది. ఈ చిత్రాలు కొత్త రాతి యుగానికి చెందినవని బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ చెప్పారు. వెంచరామిగుట్ట రాతిగుహలో బండరాళ్లపై జింకలు, ఎద్దులతోపాటు మనుషులు ఆయుధాలతో పోరాడే బొమ్మలను గుర్తించినట్టు తెలిపారు. ఇటువంటి చెక్కుడు బొమ్మలు రాష్ట్రంలోని నీలాద్రి, అక్షరాలలొద్ది, ఎడితనూరు, జూపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.