హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): లౌకికవాదాన్ని సమున్నతంగా గౌరవిస్తున్న సీఎం కేసీఆర్ ఆదర్శ లౌకికవాదిగా నిలిచిపోతారని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం ప్రశంసించారు. సోమవారం నాంపల్లిలోని వక్ఫ్‌బోర్డు ప్రాంగణంలో రూ.21 లక్షల విలువైన 2,500 రంజాన్ తోఫాలను పేద ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ సమానంగా పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గిఫ్ట్‌ప్యాక్‌లు అందజేస్తున్నదని తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజాసంక్షేమం ఆపకూడదని సీఎం కేసీఆర్ పట్టుదలతో ముస్లింలకు రంజాన్ కానుకలు అందిస్తున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు.