హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగానికి ఇక్రిశాట్ రక్షణ కవ చంలా నిలుస్తున్నది. వాతావరణ మార్పులు, భూసారం తగ్గుదల, తెగుళ్ల వల్ల ఎదురవుతున్న పలు సమస్యలకు పరిష్కారం చూపుతున్నది.
ఇక్రిశాట్ ఇప్పటివరకు అం తరించిపోయే ప్రమాదం ఉన్న 33 వేల వంగడాలను సంరక్షించింది. వీటిలో 20,838 రకాల శనగ వండగా లు, 13,559 రకాల కంది వంగడాలు ఉన్నాయి. వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో సాగుకు అనువైన ఈ వంగడాలను 218 దేశాలకు పంపిణీ చేసింది.