హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): మొబైల్ ఉత్పత్తుల విక్రయ కేంద్రంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కోఠిలోని ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఉత్పత్తుల దుకాణంలో బీఐఎస్ ధ్రువీకరణ లేని చార్జర్లు అమ్ముతున్నారన్న సమాచారంతో అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. బీఐఎస్ ధ్రువీకరణ లేని చార్జర్లను, నకిలీ రిజిస్ట్రేషన్ మార్ ఉన్న చార్జర్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.