హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): ఐఏఎస్ అధికారి రోనాల్డ్‌రోస్‌కు హైకోర్టులో చుకెదురైంది. ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ ఏప్రిల్‌లో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఆ తర్వాత డీవోపీటీ రిైప్లె కౌంటర్ వేసేందుకు 2 వారాల సమయం ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక మేరకు ఏ రాష్ట్ర క్యాడర్‌కు కేటాయించిన అధికారులు ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని 2024 అక్టోబర్‌లో డీవోపీటీ ఆదేశాలు జారీచేసింది.
దీనిపై ‘క్యాట్’ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలను జారీచేసేందుకు ‘క్యాట్’తో పాటు హైకోర్టు కూడా నిరాకరించింది. వాదనలు విన్న తర్వాత తీర్పు వెల్లడిస్తామని, డీవోపీటీ ఆ దేశాలు పాటించాలని పేరొన్నది. దీన్ని హైకోర్టు కూడా సమర్థించడంతో ఆయన ఏపీకి వెళ్లారు. వాదనలు విన్న క్యాట్.. రోనాల్డ్‌రోస్‌ను తె లంగాణకు కేటాయించాలని ఏప్రిల్ 9న డీ వోపీటీని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ డీవోపీటీ హైకోర్టులో అప్పీల్ చేయగా జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టి ‘క్యాట్’ ఉత్తర్వులపై స్టే విధించింది. విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.