హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నదని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కసరత్తు తుది దశకు చేరినట్టు తెలిపాయి.
ముఖ్యశాఖల ఉన్నతాధికారులను సైతం మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నదని, ఆశించిన స్థాయిలో వారి పనితీరు లేకపోవడంతోనే ఈ మార్పునకు సిద్ధమైట్టు సమాచారం.