హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పార్టీపై అలకబూనారు. గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా టీ ఉమామహేంద్రను ని యమిస్తున్నట్టు గురువారం రాత్రి బీజేపీ ప్రకటించిది. దీంతో రాజాసింగ్ మనస్తాపం చెంది ఓ ఆడియోను విడుదల చేశారు. ‘గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవికి తాను సూచించిన పేరు ను పట్టించుకోలేదు. వేరే వ్యక్తికి ఇచ్చారు. పార్టీకి నా అవసరం లేదని అనుకుంటున్నా. మున్ముం దు నా బలమేందో చూపి స్తా’ అంటూ వీడియోలో పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజాసింగ్ 14 నెలలుగా అలక వీడటం లేదని, పార్టీ, అసెంబ్లీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ పెద్దలు రాజాసింగ్‌పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది.