హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో ఆసక్తిని కనబరుస్తున్నాయి. వారి వ్యాఖ్యలు ప్రభుత్వానికి , అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేకా వెంకటస్వామి( Minister Vivek Venkataswamy) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
బ్రేకింగ్ న్యూస్
వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా.. మా ప్రభుత్వం దిగిపోతుంది
అందుకే నేను మీకు గ్యారెంటీ ఇవ్వలేను
– పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి వివేక్ వెంకటస్వామి pic.twitter.com/RSZsk7nEIR
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2026
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి స్కీం ( Shakti Scheme ) లో విలీనం చేసే ఆలోచనపై కళాశాలలకు చెందిన విద్యార్థులు ( Politechnic Students ) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . దీంతో పాటు ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు వినతి పత్రాలను సమర్పిస్తూ తమ గోడును వెల్లబుచ్చుకుంటున్నారు.
ఇందులో భాగంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చెన్నూరు పట్టణంలో మంత్రి వివేకా ఇంటికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరగా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఇప్పుడు మంత్రిగా నేను ఉన్నా.. రేపు నేను ఓడిపోతా ( Lose ) ..మా గవర్నమెంట్ పోతది..నా గ్యారెంటీ తో మీకేం ఫాయిదా? అంటూ వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు తలనొప్పిగా మారాయి.