హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ మళ్లీ పుంజుకుంది. మంగళవారం టేబుల్ టాపర్ నమ్దారీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ 1-1తో డ్రాగా ముగించింది. మ్యాచ్ లో ఇరు జట్లు హోరీహోరీగా తలపడ్డాయి.
మ్యాచ్ 33వ నిమిషంలో ఎలీ సాబియా గోల్‌తో నమ్దారీ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ద్వితీయార్ధం మొదలైన తొలి నిమిషానికే దక్కన్ ఎఫ్‌సీ ప్లేయర్ విలియమ్ ఒలీవిరా గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. మరో గోల్ కోసం రెండు జట్లు కడదాకా ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.