హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీపై ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. టీఎస్ ఆర్టీసీ సంస్థ నుంచి తాను ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని సంస్థ ఎండీ సజ్జనార్‌కు బాజిరెడ్డి లేఖ రాశారు. శాసనసభ సభ్యునిగా వస్తున్న జీతభత్యాలు చాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున భారం మోపడం ఇష్టం లేదని బాజిరెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డికి ఎండీ సజ్జనార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాజిరెడ్డి నిర్ణయం పట్ల ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.