హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): సత్వర సాగునీటి ప్రయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పనుల పురోగతిపై కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ నెల 29న తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. ఏఐబీపీ కింద తెలంగాణలో 11 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం దేవాదుల, పెద్దవాగు, రాజీవ్‌భీమా తదితర ప్రాజెక్టుల పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల భూసేకరణ జాప్యం వల్ల పనులు ముందుకు సాగడంలేదని, దీన్ని అధిగమించేందుకు రూ.140 కోట్లు విడుదల చేయాలని గతంలోనే కేంద్రానికి తెలంగాణ ప్రతిపాదనలు పంపింది. దీంతోపాటు మరిన్ని అంశాలపై జల్‌శక్తి శాఖ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.