పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ముతో సొంతింటి కల నెరవేర్చుకున్న మధ్యతరగతి ప్రజల కలలను కూడా కాంగ్రెస్ సర్కారు కాలరాస్తున్నది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చెరువు పరిధిలోని పటేల్‌గూడలో సత్యనారాయణ అనే ఉద్యోగి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకోగా.. గృహప్రవేశమైన ఆరు రోజులకే హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఏండ్ల కల నేలమట్టమైంది.