హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లి వద్ద దివ్యనగర్ లేఅవుట్లో శనివారం హైడ్రా కూల్చివేతలు చేప ట్టింది. రోడ్లను మూసేసి 4కిలోమీటర్ల మేర అక్రమం గా నిర్మించిన భారీ ప్రహరీని 12 హెవీ బుల్డోజర్లతో కూల్చేశారు. దివ్య లేఅవుట్లో ఉన్న తమ ప్లాట్ల వద్దకు వెళ్లే వీలులేకుండా ఎన్ఎంఆర్ సంస్థ యజ మాని నల్లమల్లారెడ్డి ప్రహరీ నిర్మించారని ప్లాట్ల యజ మానులు ఫిర్యాదు చేశారు.
క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన హైడ్రా.. ప్రహరీ అక్రమ కట్టడమని తేల్చి కూల్చివేసింది. నల్లమల్లారెడ్డి తన లేఅవుట్‌కు భద్రత పేరిట 200 ఎకరాల చుట్టూ నిబంధనలు ఉల్లం ఘించి ప్రహరీ కట్టారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. విచారణ అనంతరం స్థానిక మున్సిప ల్, రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడమేనని నిర్ధారించిన తర్వాతే కూల్చివేసినట్టు పేర్కొన్నారు.