ASI Umadevi | సైదాబాద్, ఏప్రిల్ 22: ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థిని ఆలింగనం చేసుకొన్న ఓ మహిళా ఏఎస్సైని సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం సాయంత్రం ఐఎస్ సదన్ డివిజన్లోని వినయ్నగర్కాలనీలో హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపల్లె మాధవీలత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సైదాబాద్ పీఎస్‌కు చెందిన ఏఎస్సై ఉమాదేవి.. మాధవీలతతో కరచాలనం చేసి, ఆలింగనం చేసుకొన్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి కూడా వెళ్లాయి. దీంతో ఆయన ఏఎస్సై ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.