రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణం పనులు చురుగ్గా జరుగు తున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ప్రధానం కావడంతో ఆయనను స్మరించుకోవడానికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్ మధ్య పార్టీ జోన్ స్థలంలో అంబేద్కర్ విగ్రహంతోపాటు మెమోరియల్ పార్కు నిర్మిస్తున్నారు. మ్యూజియం, గ్రంథాలయాన్ని వేల మంది సందర్శించుకొనేలా అత్యాధునిక వసతులను కల్పిస్తున్నారు. భారీ విగ్రహం కోసం చైనాలో అధ్యయనం చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని పనులు వేగంగా సాగుతున్నాయి.
స్థలం : 11 ఎకరాలు
విగ్రహం ఎత్తు : 125 అడుగులు
అంచనా వ్యయం: రూ.150 కోట్లు