హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్న్షిప్ను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) సెక్రటరీ షఫీవుల్లా విద్యార్థులకు సూచించారు.
మంగళవారం హైదరాబాద్లోని న్యాక్ క్యాంపస్లో టీఎంఆర్ఈఐఎస్ విద్యార్థుల కోసం ‘కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్’ అనే 30రోజుల ఇంటర్న్షిప్ను న్యాక్ డైరెక్టర్ జనరల్ కే భిక్షపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా షఫీవుల్లా మాట్లాడుతూ విద్యార్థులకు వెల్డింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, తాపీ పనుల గురించి న్యాక్ అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఇది భవిష్యత్తులో వారికెంతో ఉపయోగ పడుతుందని చెప్పారు.