DC Movie | టాలెంటెడ్ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘డీసీ’ (DC) సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న ఈ చిత్రం తాజాగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో దర్శకుడిగా సత్తచాటిన లోకీ నటుడిగా కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
శరత్ చంద్ర చటోపాధ్యాయ క్లాసిక్ నవల ‘దేవదాస్’ స్ఫూర్తితో, అరుణ్ మాథేశ్వరన్ తనదైన మాస్ అండ్ రా యాక్షన్ శైలిలో తెరకెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్ మరియు కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో దేవదాస్ పాత్రలో లోకేష్ కనగరాజ్ తన తొలి నటనతోనే విమర్శకుల ప్రశంసలు అందుకోగా, చంద్ర పాత్రలో వామికా గబ్బి మరియు మరో ప్రధాన పాత్రలో సంజనా కృష్ణమూర్తి నటన సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన ఉత్కంఠభరితమైన నేపథ్య సంగీతం, ముకేష్ జి సినిమాటోగ్రఫీ, ప్రసన్న జి.కె ఎడిటింగ్ ఈ సినిమా స్థాయిని విపరీతంగా పెంచేశాయి.
Massive Blockbuster #DC 🔥@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #WamiqaGabbi @isanjkayy @mukesh_DOP @editor_prasanna @skannanartdir @PC_stunts @kabilanchelliah @kuchirayar73 @RIAZtheboss pic.twitter.com/L1kiEqdINr
— Sun Pictures (@sunpictures) August 21, 2026