జైపూర్: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కార్యకర్తలకు రాజస్థాన్‌లో చేదు అనుభవం ఎదురైంది. జైపూర్ జిల్లాలోని రాంపురా కన్వర్పురా గ్రామంలోని స్కూల్‌ను తనిఖీ చేసేందుకు సీజేపీ కార్యకర్తలు వెళ్తారు. అయితే ఆ పార్టీ కార్యకర్తలు ఊరిలోకి ప్రవేశిస్తున్న సమయంలో స్థానికులు వారిపై తిరగబడ్డారు. సీజేపీ కార్యకర్తలను గ్రామస్థులు వెనక్కి నెట్టి పంపించారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్కూల్ ఠీక్ కరో ప్రచారంలో భాగంగా సీజేపీ కార్యకర్తలు ఆ గ్రామాన్ని విజిట్ చేశారు. గ్రామంలోకి ప్రవేశించిన ప్రధాన రోడ్డును గ్రామస్థులు మూసివేయడంతో సీజేపీ కార్యకర్తలతో గలాటా జరిగింది. సీజేపీ కార్యకర్తలపై చేయి చేసుకుని, వారిని ఊరి నుంచి తరిమేశారు. కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. గ్రామస్థులకు బీజేపీ వర్కర్లు తోడైనట్లు తెలుస్తోంది. స్కూల్‌ను తామే రిపేర్ చేసుకుంటాని, తమకు నిధులు వచ్చాయని గ్రామస్థులు చెప్పారు.
A Cockroach Janta Party (#CJP) team, which was visiting a government school in #Rampura #Kanwarpura in #Jaipur district, #Rajasthan attacked pic.twitter.com/spCudI7upN
— BNN Channel (@Bavazir_network) August 21, 2026
సీజేపీకి వ్యతిరేకంగా స్కూల్ ముందు బైఠాయించి, గ్రామస్థులు నినాదాలు చేశారు. ప్రస్తుతం స్కూల్ బాగాలేకపోవడంతో.. సమీపంలోని గోవుల కొట్టంలో క్లాసులను నిర్వహిస్తున్నారు.