హైదరాబాద్, ఆట ప్రతినిధి : అహ్మదాబాద్ వేదికగా ఈనెల 21 నుంచి మొదలయ్యే విజయ్ హజారే టోర్నీ కోసం హెచ్‌సీఏ సీనియర్ సెలెక్షన్ కమిటీ శుక్రవారం హైదరాబాద్ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు స్టార్ బ్యాటర్ తిలక్‌వర్మ, సీనియర్ పేసర్ సీవీ మిలింద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టు వివరాలు: తిలక్‌వర్మ(కెప్టెన్), మిలింద్ (వైస్ కెప్టెన్), తన్మయ్, రోహిత్రాయుడు, నితీశ్, వరుణ్, అభిరాత్, నితేశ్, రాహుల్ రాదేశ్, అలీ కచి, నిశాంత్, అజయ్‌దేవ్, తనయ్, అనికేత్‌రెడ్డి, ముదాస్సిర్.