హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోపాలిటల్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అన్ని సౌకర్యాలతో స్థలాలను అభివృద్ధి పరిచి విక్రయిస్తున్నది. గ్రేటర్ పరిధిలో స్థలాల వేలం విక్రయాలకు వినియోగదారుల నుంచి అద్భు త స్పందన లభిస్తున్నది. రెండురోజుల క్రితం జరిగిన వేలంలో బాచుపల్లి వద్ద గజం ధర రూ.68 వేలు పలికింది. ఇక్కడ 50 ప్లాట్లను విక్రయానికి పెట్టగా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. బాచుపల్లిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లలో ప్లాట్లను కొనేందుకు నగరవాసులతోపాటు ఎన్నారైలు ఆసక్తి చూపిస్తున్నారు.
గ్రేటర్ చుట్టూ హెచ్ఎండీఏ లేఅవుట్లు
బహదూర్‌పల్లి, తుర్కయాంజాల్, తొర్రూ రు, కుర్మల్‌గూడ, మోకిల, బుద్వేల్, భోగా రం, ఇనుముల్ నర్వ, మేడిపల్లి, బాచుపల్లి, లేమూ రు, వెలిజర్ల, షాబాద్‌లో లేఅవుట్లు ఉన్నాయి.