RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
RTC Conductors | హైదరాబాద్ కుషాయిగూడ ఆర్టీసీ డిపో వద్ద బుధవారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి అంటూ మహిళా కండక్టర్లను ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు.
RTC Conductors | హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడ ఆర్టీసీ డిపో వద్ద బుధవారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డిపో వద్దకు వచ్చిన మహిళా కండక్టర్లను ఆర్టీసీ అధికారులు విధుల్లోకి అనుమతించలేదు. ఆర్టీసీ డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి అంటూ వారిని అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులకు కేటాయించిన డ్రైవర్లు విధులకు రాకపోతే తాము సెలవు పెట్టి వెళ్లాలని అధికారులు చెబుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు విధుల్లోకి అనుమతించాలని డిపో ఎదుటే ఎదురుచూస్తున్నారు.
ఉదయం నుంచే డిపోకు చేరుకున్నప్పటికీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని మహిళా కండక్టర్లు తెలిపారు. డ్రైవర్లు విధులకు హాజరుకాని సందర్భాల్లో తమను సెలవు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. తాము విధులకు సిద్ధంగా ఉన్నప్పటికీ అనవసరంగా సెలవు తీసుకుంటే జీతంపై ప్రభావం పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రైవర్లు రాకపోతే అందుకు కండక్టర్లు ఎందుకు సెలవు పెట్టాలని వారు ప్రశ్నించారు. ఉదయం నుంచి డిపోలోనే వేచి ఉన్నా తమకు విధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వడం లేదని వాపోయారు. విధులకు హాజరైన ఉద్యోగులను అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయనివ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే, డిపో అధికారుల వివరణ మరోలా ఉంది. డ్రైవర్ విధులకు గైర్హాజరైనంత మాత్రాన అదే బస్సుకు కేటాయించిన కండక్టర్‌కు సెలవు వేస్తారనడం అవాస్తవమని వారు స్పష్టం చేశారు. కండక్టర్లకు పూర్తి జీతాలు అందుతాయని, సెలవుగా నమోదు చేయడం వల్ల జీతంలో కోత ఉండదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

