SIB | హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచంలో ఎంబీఏ కోర్సులు అందించే అత్యుత్తమ 100 సంస్థల్లో ఐఎస్బీకి స్థానం లభించింది. బుధవారం ప్రకటించిన క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం దీనితో పాటు ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-అహ్మదాబాద్, ఐఐఎం-కలకత్తా కూడా టాప్ 100లో నిలిచాయి.
ఈ మూడు ఐఐఎంలు ఉపాధి కల్పన విషయంలో టాప్ 50లో నిలిచాయి. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. క్యూఎస్ గ్లోబల్ ఎంబీఏ, బిజినెస్ మాస్టర్స్ ర్యాంకింగ్ 2025 కింద 58 దేశాలకు చెందిన విద్యాసంస్థలు టాప్ 100లో నిలిచాయి. మనదేశం నుంచి ఈ నాలుగు సంస్థలను ఎంపిక చేశారు. ఈ ర్యాకింగ్స్లో 2025కు భారత్‌లోని 14 ఫుల్‌టైమ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లను పరిగణనలోకి తీసుకున్నట్టు క్యూఎస్ సీఈవో జెస్సికా తెలిపారు.