హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీదీపిక కొమిరెడ్డి స్టేట్ టాపర్‌గా నిలిచింది. 900 మార్కులకు లక్ష్మీదీపిక 550 మార్కులతో స్టేట్ మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నది. ఇటీవలే సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరైన లక్ష్మీదీపిక, తాజాగా మెయిన్స్ ఫలితాల్లోనూ ప్రతిభ చూపింది. సివిల్స్‌లో ఒక సారి ప్రిలిమ్స్, రెండు సార్లు మెయిన్స్‌కు హాజరైంది. త్వరలో విడుదల కాబోయే తుది ఫలితాలపై లక్ష్మీదీపిక ఆశలు పెట్టుకున్నది. ఈ క్రమంలోనే టాప్ ర్యాంకు రావడం గమనార్హం. గ్రేటర్‌లోని ఏఎస్రావు నగర్లో నివాసముండే లక్ష్మీ దీపిక తండ్రి రిటైర్డ్ కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తల్లి గృహిణి. గ్రూప్-1 జీఆర్‌ఎల్‌ను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది.
ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశా. యూఎస్ పోదామనుకున్నా.. కానీ రద్దు చేసుకుని యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టా. సివిల్స్‌కు ప్రిపేర్‌కావడం గ్రూప్-1కు కలిసొచ్చింది. గ్రూప్-1కు ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. సొంతంగానే ప్రిపేరయ్యా. 80శాతం సిలబస్ కామన్‌గా ఉండటంతో సులభమైంది. 20శాతం తెలంగాణ అంశాలను జాగ్రత్తగా ప్రిపేరయ్యా.
-లక్ష్మీదీపిక, స్టేట్ మొదటి ర్యాంకు