సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)/బన్సిలాల్‌పేట : ప్రభుత్వ దవాఖానల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నది. కార్పొరేట్ దవాఖానలను తలదన్నేలా సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే గాంధీ దవాఖానలో పారిశుద్ధ్య వ్యవస్థ ఆధునీకరణకు తాజాగా రూ.14.56 కోట్ల నిధులు కేటాయించింది. హాస్పిటల్లో మొత్తం 8అంతస్తుల భవన సముదాయం ఉండగా ఆ సముదాయంలోని అంతర్గత పారిశుద్ధ్య వ్యవస్థ, బాహ్య వ్యవస్థ, అంతర్గ, బాహ్య సీవరేజ్ వ్యవస్థతో పాటు వర్షం నీరు వెళ్లే డ్రైన్ వ్యవస్థ తదితరాలను ఆధునీకరించేందుకు రూ.11.94కోట్లు కేటాయించారు. మిగిలిన నిధులను జీఎస్టీ, సూపర్విజన్ తదితర చార్జీలకు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
దవాఖాన రూపురేఖలు మారుతాయ్: డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన
కార్పొరేట్లో కూడా చేయని వైద్యం గాంధీ హాస్పిటల్లో అందిస్తున్నాం. ఒకప్పుడు నిరుపేదలు మాత్రమే వచ్చే గాంధీ, ఉస్మానియా వంటి గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు ఇప్పుడు సంప్పన్న వర్గాలకు చెందిన రోగులు కూడా వస్తున్నారు. గాంధీలో శానిటేషన్ సిస్టమ్ కొంత ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా రెయినీ సీజన్లో డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. సెల్లార్లోకి మొత్తం వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ విషయాన్ని మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లాం. సమస్యను పరిశీలించి వెంటనే స్పందించారు. స్పందించడమే కాకుండా రూ.14.56కోట్ల నిధులు మంజూరు చేసి తగిన పరిష్కారం చూపడం సంతోషకరం.
పారిశుద్ధ్య వ్యవస్థ
ప్రక్షాళనతో వీటికి మోక్షం:సెల్లార్లో ఉన్న అన్ని విభాగాలు కిచెన్ ఫిజియోథెరపి క్యాంటీన్ సీఎస్డీ(సెంట్రల్ స్టెరలైజేషన్ డిపార్ట్మెంట్) ల్యాండ్రీ
మెడికల్ స్టోర్ఎలక్ట్రికల్ విభాగం