అక్రమ నివాసం.. డ్రగ్స్‌తో విన్యాసం
- పలువురు ఆఫ్రికన్ దేశస్థుల నిర్వాకమిది
- హెచ్‌న్యూ స్పెషల్ డ్రైవ్‌లో వెలుగులోకి
- వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): వీసా ముగిసినా దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న ఆఫ్రికన్లను పోలీసులు పట్టుకొన్నారు. వీరిలో కొందరు డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. కొందరు విదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్నట్టు తెలుసుకొన్న హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్.. స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో ఏడుగురి వీసా గడువు ముగిసినట్టు తేలింది. ఇద్దరు డ్రగ్స్ అమ్ముతున్నట్టు తెలుసుకొని అరెస్టు చేశారు. బషీర్‌బాగ్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆ వివరాలను మీడియాతో వెల్లడించారు.
పోలీసుల సోదాల్లో ఉగ్వు అంటోని సండే (నైజీరియా), కొనె మౌస్సా(ఐవరీకోస్ట్), అస్సెయూ విలియమ్ డికాైస్టెర్ (ఐవరీకోస్ట్), ఓబోయిరా పీటర్ చుక్వుమేకా (నైజీరియా), ఉమెయిజిరా కింగ్స్లే (నైజీరియా), హెన్రి చిగ్బో ఉమెబ్యూనీ (నైజీరియా),అమోబీచుడ్వు (నైజీరియా) అక్రమంగా నివాసం ఉంటున్నట్టు తేలిందని చెప్పారు. వీరిలో హెన్రి చిగ్బో ఉమెబ్యూనీ, అమోబీచుడ్వు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. వారి నుంచి రూ.13 లక్షల విలువ చేసే మెటాఫెటామైన్, కొకైన్ స్వాధీనం చేసుకొని అరెస్టు చేశామని వెల్లడించారు. మిగతా ఐదుగురిని వారి స్వదేశానికి పంపేందుకు(డీపోట్) చర్యలు తీసుకొన్నామని వివరించారు. వీరిలో ఒకరికి వేరే రాష్ట్రంలో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నదని తెలిపారు.సమావేశంలో డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్‌లో 2,900 మంది ఆఫ్రికన్లు నివాసం ఉంటున్నారని, దాదాపు 750 మంది వీసా, పాసుపోర్టు గడువు ముగిసినా అక్రమంగా తిష్ఠ వేశారని డ్రైవ్‌లో వెలుగులోకి వచ్చింది. వీరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

