రాష్ట్రంలో ఎక్కడైనా చీమ చిటుక్కుమన్నా తెలిసేలా, హైదరాబాద్ మొత్తం నిఘా నీడలో ఉండేలా దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ నెల 4న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది.
ఈ భవంతి పైనుంచి మొత్తం నగరాన్ని విహంగ వీక్షణం చేయొచ్చు.