హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తేతెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 డిసెంబర్ 23న నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు 10, 11న మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
టీజీపీఎస్సీ సెక్రటరీ గురువారం ప్రకటన విడుదల చేశారు. పూర్తివివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10:30 గంటల్లోగా నాంపల్లి, హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు.