హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్డబ్ల్యూవో), మ్యాట్రన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఆయా పోస్టుల ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేసింది. హెచ్డబ్ల్యూవోగా 561, మ్యాట్రన్గా 13 మంది చొప్పున 574 మందిని కమిషన్ ఎంపికచేసింది.
మొత్తం 581 హెచ్డబ్ల్యూవో నోటిఫికేషన్ 2022 డిసెంబర్లో విడుదల చేసింది. మొత్తం 1,45,359 మంది దరఖాస్తు చేశారు. 2024 జూన్ 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించారు. జీఆర్ఎల్ను విడుదలచేసిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి తాజాగా తుది ఫలితాలు ప్రకటించారు.