బంజారాహిల్స్, నవంబర్ 26: తరచూ భార్యను కొట్టడంతోపాటు పిల్లలను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తికి ఏడురోజుల జైలుశిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 12 భోళానగర్లో నివాసం ఉంటున్న సయ్యద్ ఖాదర్(49)కు భార్య షాహీన్బేగంతోపాటు ఐదుగురు పిల్లలున్నారు. ఈనెల 24న సాయంత్రం తాగి వచ్చిన ఖాదర్ భార్యను కొట్టడంతోపాటు కుమార్తెను తీవ్రపదజాలంతో దూషించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసిన బంజారాహిల్స్ పోలీసు లు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని 10వ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. కేసు విచారించిన న్యాయమూర్తి తరచూ నిందితుడికి ఏడురోజుల జైలుశిక్ష విధించారు.